వనపర్తి టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు అయిదు నెలలుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను త్వరగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీఆర్టీయూ రాష్ట్ర్ర అసోసియేట్ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు శుక్రవారం ఆర్డీఓ రామచందర్‌కు వినతిపత్రం అందజేశారు.
బిల్లులు ఇప్పించాలని వినతి
Sep 10 2016 12:03 AM | Updated on Sep 3 2019 8:56 PM
వనపర్తి టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు అయిదు నెలలుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను త్వరగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీఆర్టీయూ రాష్ట్ర్ర అసోసియేట్ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు శుక్రవారం ఆర్డీఓ రామచందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వంట ఏజెన్సీలు వేసవి కాలంలోనూ సేవలందించారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు మూడు గుడ్లు ఇవ్వాలనే నిబంధనపై స్పష ్టత వంట ఏజెన్సీలకు ఇవ్వలేదని చెప్పా రు. విద్యార్థులకు సకాలంలో మధ్యాహ్న భోజ నం అందిస్తున్న వంట ఏజెన్సీలకు న్యా య ం చేయాలని, లేదంటే భోజన వడ్డింపులో నాణ్యత లోపిస్తే దానికి ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, సాయిశ్వర్, ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement