జిల్లా కరువుని పరిశీలించేందుకు వస్తున్న కేంద్ర బృందానికి వాస్తవ నివేదిక ఇవ్వాలని అధికారులను రైతు సంఘం (సీపీఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
అనంతపురం అర్బన్ : జిల్లా కరువుని పరిశీలించేందుకు వస్తున్న కేంద్ర బృందానికి వాస్తవ నివేదిక ఇవ్వాలని అధికారులను రైతు సంఘం (సీపీఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో వేరుశనగ పంట 6,09,377 హెక్టార్లలో నష్టం జరిగిందని తెలిపారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందని, అయితే కరువు మాడ్యూల్‌ని అమలు చేయడం లేదని తెలిపారు. కరువు నివారణకు నిధులు కేటాయించలేదని తెలియజేశారు.