మొక్కలు నాటిన దివ్యాంగులు | physically challenged people planted trees | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటిన దివ్యాంగులు

Jul 25 2016 11:54 PM | Updated on Sep 4 2017 6:14 AM

పట్టణంలోని అంగడిబజార్‌ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో సోమవారం పట్టణానికి చెందిన పలువురు దివ్యాంగులు మొక్కలను నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు.

రామకష్ణాపూర్‌ : పట్టణంలోని అంగడిబజార్‌ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో సోమవారం పట్టణానికి చెందిన పలువురు దివ్యాంగులు మొక్కలను నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. మనిషి మనుగడ చెట్ల మీదే ఆధారపడి ఉందని, గాలి, నీరు, భూమి, ఆకాశం కలుషితం కాకుండా చెట్లు కాపాడుతాయని దివ్యాంగుల చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు మెడపట్ల సతీశ్‌ అన్నారు. కార్యక్రమంలో వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు రామిల్ల చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి సముద్రాల చిరంజీవి, తల్లపెల్లి దుర్గయ్య, గోపాలకృష్ణ, బెడవేన సతీశ్, అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement