పరస్పరం దాడులు..ఒకరి మృతి
పొన్నూరు : పాతకక్షల నేప«థ్యంలో పరస్పరం జరుపుకున్న దాడుల్లో ఒకరు మృతిచెందగా, ఇద్దరు గాయాలపాలైన సంఘటన మండల పరిధిలోని జూపూడి గ్రామంలో సోమవారం జరిగింది.
పొన్నూరు : పాతకక్షల నేప«థ్యంలో పరస్పరం జరుపుకున్న దాడుల్లో ఒకరు మృతిచెందగా, ఇద్దరు గాయాలపాలైన సంఘటన మండల పరిధిలోని జూపూడి గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు..జూపూడి గ్రామానికి చెందిన గండికోట శ్రీనివాసరావు పొలానికి వెళుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన తాడిశెట్టి కృష్ణ బరిసెతో దాడిచేశాడు. ప్రాణభయంతో తప్పించుకున్న శ్రీనివాసరావు ఇంటికి చేరుకొని బంధువులకు తెలిపాడు. శ్రీనివాసరావు బావమరిది కొండా సురేష్ ఈ విషయంపై మాట్లాడేందుకు కృష్ణ ఇంటికి వెళ్లాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి సురేష్‌ను కృష్ణ పొట్టలో బరిసెతో పొడవడంతో అతని పేగులు బయటపడ్డాయి. స్థానికులు అతన్ని నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు వర్గీయులు మూకుమ్మడిగా కృష్ణపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో కృష్ణ స్ఫృహతప్పి పడిపోయాడు. అతన్ని గుంటూరు తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలను, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొన్నూరు రూరల్, అర్బన్, పెదనందిపాడు, కాకుమాను స్టేషన్లకు సంబం«ధించిన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బాపట్ల డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.