సత్తాచాటిన ‘పశ్చిమ’ బాలికలు | performence shown by "west' girls | Sakshi
Sakshi News home page

సత్తాచాటిన ‘పశ్చిమ’ బాలికలు

Sep 10 2016 9:28 PM | Updated on Sep 4 2017 12:58 PM

సత్తాచాటిన ‘పశ్చిమ’ బాలికలు

సత్తాచాటిన ‘పశ్చిమ’ బాలికలు

ఏలూరు రూరల్‌: జిల్లా బాలికలు క్రికెట్‌ పోటీల్లో అప్రతిహత విజయాలు సాధిస్తున్నారు. మూడేళ్లగా అండర్‌–16, 19 విభాగాల్లో విజయకేతనం ఎగురవేయగా తాజాగా అండర్‌–16 జిల్లా బాలికల జట్టు సెంట్రల్‌ జోన్‌ విజేతగా నిలిచింది.

 ఏలూరు రూరల్‌: జిల్లా బాలికలు క్రికెట్‌ పోటీల్లో అప్రతిహత విజయాలు సాధిస్తున్నారు. మూడేళ్లగా అండర్‌–16, 19 విభాగాల్లో విజయకేతనం ఎగురవేయగా తాజాగా అండర్‌–16 జిల్లా బాలికల జట్టు సెంట్రల్‌ జోన్‌ విజేతగా నిలిచింది. ఈనెల 3 నుంచి 9 వరకు గుంటూరులో జరిగిన అంతర్‌ జిల్లాల్లో క్రికెట్‌ పోటీల్లో జిల్లాజట్టు సత్తాచాటింది. పోటీల్లో ప్రతిభ చాటిన ఈ.తేజస్వి, యు.సంధ్య, ఎస్‌.మంజుల, వి.స్రవంతి సెంట్రల్‌ జోన్‌ జట్టుకు ఎంపికయ్యారని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోకరాజు రామరాజు తెలిపారు. బాలికలకు శిక్షణ ఇచ్చిన కోచ్‌ ఎస్‌.రమాదేవి, పీఈటీ ప్రవీణతో పాటు క్రీడాకారులను అసోసియేషన్‌ సభ్యులు వి.విద్యాప్రసాద్, ఎం.వగేష్‌కుమార్, వీఎస్‌ మంగేష్‌ ఎండీఎఫ్‌ రెహమాన్‌ అభినందించారు.   
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement