కుడాపై ప్రజాభిప్రాయ సేకరణ | peoples openion on kuda | Sakshi
Sakshi News home page

కుడాపై ప్రజాభిప్రాయ సేకరణ

Nov 3 2016 12:09 AM | Updated on Mar 21 2019 8:35 PM

కుడా(కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

– అభ్యంతరాలు ఉంటే కలెక్టర్‌కు విన్నవించండి 
– జీవో 277 జారీ
 
కర్నూలు(టౌన్‌): కుడా(కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని మున్సిపల్‌ కార్యదర్శి కరికల్‌ వలవన్‌ జీవో 277ను జారీ చేశారు. నెల రోజుల పాటు ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. కర్నూలు మండల పరిధిలో 17 గ్రామాలు, కల్లూరులో 18, గూడూరులో 10, ఓర్వకల్లులో 20, వెల్దుర్తిలో 16, పాణ్యంలో 12, నంద్యాలలో 7, బేతంచెర్లలో 11 గ్రామాలు కలిపి మొత్తం 111 గ్రామాలు కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోకి రానున్నాయి. కుడాపై ఆయా గ్రామాల పరిధిలో స్థానిక ప్రజల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే జిల్లాకలెక్టర్‌కు విన్నవించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement