వైఎస్ జగన్ను కలసిన అంజిబాబు | pathapati anjibabu met ys jagan in guntur district | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను కలసిన అంజిబాబు

Sep 27 2016 10:27 AM | Updated on Aug 18 2018 9:09 PM

రజకులు ఎస్సీల జాబితాలో చేర్చే అంశాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

గుంటూరు : రజకులు ఎస్సీల జాబితాలో చేర్చే అంశాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ను ఏపీ రజక సంఘం అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు కలిశారు. తమ సామాజిక వర్గాన్ని ఎస్సీల్లో చేర్చే డిమాండ్కు మద్దతు ఇవ్వాలని వైఎస్ జగన్ను కోరారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాన్ని సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు అమలు చేయలేదని వైఎస్ జగన్కు ఆయన చెప్పారు.

ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయనకు అంజిబాబు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. భారీ వర్షాలకు పలువురు  మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ సోమవారం నుంచి రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement