రామగిరి ప్యాసింజర్‌లో రేషన్ బియ్యం స్వాధీనం | Passenger ramagiri ration rice seized | Sakshi
Sakshi News home page

రామగిరి ప్యాసింజర్‌లో రేషన్ బియ్యం స్వాధీనం

Oct 8 2016 12:24 AM | Updated on Sep 4 2017 4:32 PM

కాజీపేట నుంచి బ ల్లార్షాకు వెళ్లే రామగిరి ప్యాసింజర్‌ రైలు లో శుక్రవారం కాజీపేట ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. రామగిరి ప్యా సింజర్‌లోని బోగీలను శుభ్రం చేసేందు కు తెల్లవారు జామున ఫాతిమానగర్‌ వద్ద ఉన్న వాషింగ్‌ సైడ్‌షెడ్‌ వద్దకు తీసుకెళ్లారు.

కాజీపేట రూరల్‌ : కాజీపేట నుంచి బ ల్లార్షాకు వెళ్లే రామగిరి ప్యాసింజర్‌ రైలు లో శుక్రవారం కాజీపేట ఆర్‌పీఎఫ్‌  సిబ్బంది 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. రామగిరి ప్యా సింజర్‌లోని బోగీలను శుభ్రం చేసేందు కు తెల్లవారు జామున ఫాతిమానగర్‌ వద్ద ఉన్న వాషింగ్‌ సైడ్‌షెడ్‌ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బోగీలను శుభ్రం చేస్తున్న సిబ్బంది రైలులో బియ్యం మూటలను చూసి స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అలాగే ఆర్‌పీఎఫ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వాషింగ్‌ సైడ్‌ వద్దకు వెళ్లి బి య్యం మూటలను స్వాధీనం చేసుకుని ఆర్‌పీఎఫ్‌ పోలీస్‌స్టేషన్ తరలించారు. తర్వాత హన్మకొండ డీటీ జయశంకర్‌ను పిలిపించి స్వాధీనం చేసుకున్న బియ్యంను ఆయనకు అప్పగించారు. కాగా, రేషన్ బియ్యాన్ని స్థానిక రేషన్ డీలర్‌ వీరస్వామికి అప్పగించినట్లు డీటీ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement