అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి | Partners in the development of the youth needs | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

Sep 18 2016 12:10 AM | Updated on Sep 4 2017 1:53 PM

అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

గ్రామ సమగ్రాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని నెహ్రూ యువ సంఘటన జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు అన్నారు. హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్‌ కాలేజీ సెమినార్‌ హాల్‌లో నైబర్‌హుడ్‌ యూత్‌ పా ర్లమెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా శనివారం యువజన సంఘాలకు క్రీడా సామగ్రి పం పిణీ చేశారు.

  • నిధుల సద్వినియోగం, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి అవసరం
  • నెహ్రూ యువ సంఘటన ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు
  • హన్మకొండ : గ్రామ సమగ్రాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని నెహ్రూ యువ సంఘటన జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు అన్నారు. హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్‌ కాలేజీ సెమినార్‌ హాల్‌లో నైబర్‌హుడ్‌ యూత్‌ పా ర్లమెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా శనివారం యువజన సంఘాలకు క్రీడా సామగ్రి పం పిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నెహ్రూ యువ సంఘటన జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌ జ్యోతి వెలిగించి ప్రా రంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలకు పంపిస్తున్న నిధులు సక్రమంగా వినియోగమవుతున్నాయా లేదా అనే విషయంలో యువజనులు దృష్టి సారించాలన్నారు.  అలాగే, యువత నైపుణ్యాలు పెం పొందించుకోవాలన్నారు. నైపుణ్యాలుం టేనే రాణిస్తామన్నారు. అంతేకాకుండా రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాల్సిన బాధ్యత యువజన సంఘాలపై ఉందన్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్‌ రామనుజాచారి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్‌ మనోరంజన్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement