రూ.3 కోట్లతో పార్కింగ్‌ల ఏర్పాటు | parking arrangements by 3 crore | Sakshi
Sakshi News home page

రూ.3 కోట్లతో పార్కింగ్‌ల ఏర్పాటు

Jul 19 2016 11:05 PM | Updated on Sep 4 2017 5:19 AM

రూ.3 కోట్లతో పార్కింగ్‌ల ఏర్పాటు

రూ.3 కోట్లతో పార్కింగ్‌ల ఏర్పాటు

మట్టపల్లి (మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో మట్టపల్లి పుష్కర ఘాట్‌ వచ్చే భక్తుల కోసం రూ.3 కోట్లతో పార్కింగ్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఆర్‌ అండ్‌ బీ స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకట్‌ తెలిపారు.

మట్టపల్లి (మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో మట్టపల్లి పుష్కర ఘాట్‌ వచ్చే భక్తుల కోసం రూ.3 కోట్లతో పార్కింగ్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఆర్‌ అండ్‌ బీ స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకట్‌ తెలిపారు. మంగళవారం ఆయన మట్టపల్లి సమీపంలోని సుల్తాన్‌పూర్‌తండా రోడ్డు వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్‌ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.3 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి 25 ఎకరాల విస్తీర్ణంలో ఆరు పార్కింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మట్టపల్లిలోని కృష్ణా జలాల పంప్‌ హౌస్‌ వద్ద ఒక పార్కింగ్, సుల్తాన్‌పూర్‌ తండా రోడ్డు సమీపంలో ప్రధాన రహదారికి ఇరువైపులా నాలుగు పార్కింగ్‌లు, మండల కేంద్రమైన మఠంపల్లి సమీపంలో మరో పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ అండ్‌ బీ డీఈ వెంకటయ్య, ఏఈ రాజశేఖర్, మాజీ ఎంపీపీలు కొండానాయక్, లక్ష్మీవెంకటనారాయణ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement