శ్రీమఠంలో పరిమళ ప్రసాదం తయారీ మిషన్‌ | parimala prasada manufacturing machine in srimatham | Sakshi
Sakshi News home page

శ్రీమఠంలో పరిమళ ప్రసాదం తయారీ మిషన్‌

Jan 16 2017 10:32 PM | Updated on Sep 5 2017 1:21 AM

శ్రీమఠంలో పరిమళ ప్రసాదం తయారీ మిషన్‌

శ్రీమఠంలో పరిమళ ప్రసాదం తయారీ మిషన్‌

శ్రీరాఘవేంద్రస్వామి మఠం యాజమాన్యం పరిమళ ప్రసాదం తయారీ కోసం ప్రత్యేకంగా మిషనరీని తెప్పించింది.

మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం యాజమాన్యం పరిమళ ప్రసాదం తయారీ కోసం ప్రత్యేకంగా మిషనరీని తెప్పించింది. పరిమళ ప్రసాదాలను భక్తులు మహా పవిత్రంగా స్వీకరిస్తారు. నెలలో కనీసం 2 లక్షల ప్యాకెట్ల వరకు ప్రసాదాలు విక్రయిస్తున్నారు. రద్దీ సమయాల్లో ఈ సంఖ్య 5 లక్షలకు చేరుతోంది. భక్తుల డిమాండ్‌కు తగ్గట్టు ప్రసాదం తయారీని వేగవంతం చేసేందుకు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు. పరిమళ ప్రసాదం కౌంటర్‌లో రెండు మిషన్లను ఏర్పాటు చేశారు. వీటిని ప్యాకింగ్‌ చేసి కౌంటర్లలో భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement