ఓపన్‌ డిగ్రీ ప్రవేశానికి 20న తుది గడువు | Open degree for entry to deadline 20 | Sakshi
Sakshi News home page

ఓపన్‌ డిగ్రీ ప్రవేశానికి 20న తుది గడువు

Aug 14 2016 12:08 AM | Updated on Sep 4 2017 9:08 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపన్‌ డిగ్రీలో ప్రవేశానికి ఈనెల 20న తుది గడువు అని అనంతపురం మహిళా అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్‌ రామచంద్రుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపన్‌ డిగ్రీలో ప్రవేశానికి ఈనెల 20న తుది గడువు అని అనంతపురం మహిళా అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్‌ రామచంద్రుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి 2012–2016 వరకు అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ, ఇంటర్‌మీడియట్, ఓపన్‌ ఇంటర్, పాలిటెక్నిక్, నర్సింగ్‌ 10+2 పాసైన వారు అర్హులన్నారు. అదేవిధంగా ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఈనెల 20 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–245908 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement