వ్యక్తి రిమాండ్‌ | onemen remand | Sakshi
Sakshi News home page

వ్యక్తి రిమాండ్‌

Aug 18 2016 1:40 AM | Updated on Sep 4 2017 9:41 AM

మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీసులను దూషించాడు. అంతటితో ఆగకుండా పుష్కరాల విధులను నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డాడు.

గుర్రంపోడు : మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీసులను దూషించాడు. అంతటితో ఆగకుండా పుష్కరాల విధులను నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ వెంకట సాయి కిశోర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమాల చక్రపాణి బుధవారం మండలకేంద్రం సెంటర్‌లో పుష్కర విధులు నిర్వహిస్తున్న పోలీసులను మద్యం మత్తులో దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో చక్రపాణిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement