వారం రోజులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు | one week independence day celbrations in ap | Sakshi
Sakshi News home page

వారం రోజులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Jul 26 2016 12:34 AM | Updated on Aug 15 2018 7:07 PM

వారం రోజులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - Sakshi

వారం రోజులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నెల్లూరు(బారకాసు): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో వారం రోజుల పాటు ‘తిరంగా’ పేరుతో వేడుకలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తెలిపారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

  • బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి 
  • నెల్లూరు(బారకాసు): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో వారం రోజుల పాటు ‘తిరంగా’ పేరుతో వేడుకలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తెలిపారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని అన్ని వర్గాల ప్రజల్లో నింపేందుకు అన్ని మండల కేంద్రాల్లో జాతీయ జెండా చేతపట్టి ఈ తిరంగా యాత్రలను నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల అనుగుణంగా పార్టీ అవసరాల మేరకు  ఇతర పార్టీల నుంచి వచ్చేవారు ఎవరైనా సరే తమ పార్టీలో చేర్చుకోవాలని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి జిల్లాకు ఒక్కో కేంద్ర మంత్రి చొప్పున మొత్తం 13 మంది కేంద్ర మంత్రులతో ఆయా జిల్లా కేంద్రంలో సందర్శించి కార్యకర్తల, మేధావుల సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో ఏలూరులో రైతు ర్యాలీ, కడపలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. çబీజేపీ నేతలు సుధాకర్‌రెడ్డి, మధు, శేషారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement