ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని సీఆర్ నగర్‌లోని భారీగా వరద నీరు చేరింది. పాములు, తేళ్లు, ఇతర విష పురుగులు ఇళ్లలోకి వచ్చాయి.
-
వర్షపు నీటిలో కుట్టిన విషపురుగు
-
నాలుగు రోజుల తర్వాత మృత్యువాత
కరీమాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని సీఆర్ నగర్‌లోని భారీగా వరద నీరు చేరింది. పాములు, తేళ్లు, ఇతర విష పురుగులు ఇళ్లలోకి వచ్చాయి. ఈక్రమంలో సీఆర్ నగర్‌లో ఇడ్లీ బండి నడుపుతూ పొట్టపోసుకుంటున్న పిన్నోజు పూర్ణచందర్(35)ను గురువారం రాత్రి ఓ విషపు పురుగు కుట్టింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు.పూర్ణచందర్‌కు భార్య లత, ఇద్దరు పిల్లలున్నారు. ఇడ్లీ బండి నడుపుతూ జీవనం గడుపుతున్న పూర్ణచందర్ దహన సంస్కారాలకు కూడా డబ్బు లేకపోవడంతో స్థానికులు వైట్ల శరత్, బొల్లం రాజు, రాము, ప్రతాప్ తదితరులు రూ.5 వేలు జమచేసి లతకు ఇచ్చారు. వీఆర్‌ఓ శ్రీనివాస్ క్వింటా బియ్యం అందించారు.