పెట్రోల్ ట్యాంకర్ బోల్తా..ఒకరు మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ట్యాంకర్ బోల్తా..ఒకరు మృతి

May 31 2016 8:26 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు.

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు. గుంతకల్లు నుంచి గద్వాలకు పెట్రోల్‌తో వస్తున్న ట్యాంకర్ అదుపుతప్పి గద్వాల పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డుపై పడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ట్యాంకర్ క్లీనర్ రామకృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకుని పరారయ్యాడు. పెట్రోల్ లీక్ కాకపోవటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. రోడ్డుకు అడ్డంగా పడిన ట్యాంకర్‌ను పోలీసులు పొక్లెయినర్‌తో పక్కకు తప్పించి, రాకపోకలను క్రమబద్ధీకరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement