మళ్లీ ఆగిన బాయిలర్‌ | once again stp bailer | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆగిన బాయిలర్‌

Oct 4 2016 11:09 PM | Updated on Mar 28 2019 6:26 PM

అశ్వారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీలో రెండో బాయిలర్‌ మళ్లీ నిలిచిపోయింది.

  • బరువెక్కువై తెగిన మాస్టర్‌ లింక్‌ 
  • అశ్వారావుపేట : అశ్వారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీలో రెండో బాయిలర్‌ మళ్లీ నిలిచిపోయింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బాయిలర్‌ నుంచి పెద్ద శబ్దం రావడంతో కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలే అవినీతి ఆరోపణలు, కాసుల కక్కుర్తితో నాసిరకం బాయిలర్‌ను కొనుగోలు చేశారు.. ఏ క్షణాన్నయినా బాయిలర్‌ పేలొచ్చనే ఆరోపణలుండటంతో అందరి దృష్టి బాయిలర్‌పైనే పడింది. తీరా చూస్తే ఊహించినంత కాకున్నా.. దాదాపు అంతే అయినంత పనయింది. బాయిలర్‌ ఫర్నెస్‌కు పీచును పంపించే మాస్టర్‌ లింక్‌ చై¯ŒS తెగిపోయి.. అక్కడి నుంచి ఫర్నెస్‌కు పీచు వెళ్లే మార్గం ఊడిపోయింది. ఆద్యంతం విమర్శలున్నా.. ఇదే బాయిలర్‌ను కొనసాగిస్తున్నారు. బంకర్‌ కేపాసిటీ ఇక్కడున్న కార్మికులకు, ఇంజనీర్లకు, నిర్మించిన టెక్నికల్‌  సిబ్బందికి తెలియకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మేనేజర్‌ హరినాథ్‌బాబు దృష్టికి కార్మికులు తీసుకువెâýæ్లగా బంకర్‌కు ఆటోమేటిక్‌ ఫీడింగ్‌ సిస్టం ఏర్పాటు చేసే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాయిలర్‌ నిర్మించిన కంపెనీ బృందం బాయిలర్‌ను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement