కరెన్సీ కష్టాలపై బంద్‌కు మద్దతు

కరెన్సీ కష్టాలపై బంద్‌కు మద్దతు - Sakshi


నల్లధనంపై మోదీ పోరుకు అనుకూలం జనం కష్టాలతో కలవరం అందుకే భారత్ బంద్‌కు సంపూర్ణ సహకారం  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్  బ్యాంకులు, హాస్పిటల్స్‌కు మినహారుుంపు స్వచ్ఛందంగా కలసిరావాలని ప్రజలకు పిలుపు


డాబాగార్డెన్‌‌స: ‘నల్లధనంపై పోరు ఆశయం మంచిదే. కానీ ఆ క్రమంలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అంతులేకుండా ఉన్నారుు. ఈ కష్టాలకు, బాధలకు స్పందనగానే వైఎస్సార్‌సీపీ భారత్ బంద్‌కు మద్దతు ఇస్తోంది.’ అని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. నల్లధనం వెలికితీయాలన్న మోదీ నిర్ణయాన్ని, ఆశయాలను వైఎస్సార్ సీపీ స్వాగతిస్తోందని, కానీ 18 రోజులుగా దేశంలో ప్రజలు పడతున్న కష్టాలకు స్పందనగా తమ పార్టీ కేంద్రంపై పోరాడుతుందని చెప్పారు. అందుకే భారత్‌బంద్‌కు వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. జగదాంబ జంక్షన్ సమీపాన గల పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.



దేశంలో 80 నుంచి 90 శాతం ప్రజలు డబ్బుల కోసం క్యూలో పడిగాపులు పడుతున్నారని, కొందరు అభాగ్యులు ప్రాణాలు వదులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  పెళ్లిళ్లు, శుభకార్యాలకు అవరోధాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రజలు, సామాన్యులు పడతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 28న విపక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు పూర్తిగా సహకరిస్తామన్నారు. బ్యాంకులు, ఆస్పత్రులు మినహారుుస్తే.. అందరూ బంద్‌లో పాల్గొనాలని, సహకరించాలని కోరారు.


తీరు అనుచితం

ప్రధాని మోదీ ఆలోచన మంచిదే అరుునా లోటుపాట్లు చూడకుండా.. విపక్షాలతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని, నిర్ణయం తీసుకున్న తర్వాతైనా విపక్షాలను సంప్రదించకపోవడం శోచనీయమని అమర్‌నాథ్ చెప్పారు. ప్రధాని నిర్ణయం వల్ల 85 శాతం మంది సామాన్యులే ఇబ్బందులు పడతున్నారని తెలిపారు. 18 రోజుల్లో నల్లధనం ఉన్న వ్యక్తులెవరూ క్యూలైన్లలో నిల్చున్నారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సలహాలు, సూచనలతో కూడిన లేఖ రాసిన సంగతిని గుర్తు చేశారు. బంద్‌కు విశాఖ ప్రజానీకం సహకరించాలని కోరారు. వీలైతే విపక్షాలతో చర్చించనున్నట్టు చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి,  నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు(దక్షిణం), తిప్పల నాగిరెడ్డి(గాజువాక), పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రచారకమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కనకల ఈశ్వర్,  గిడ్డంగుల శాఖ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు సత్తి రామకృష్ణారెడ్డి, మహిళ విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, ఎస్సీ సెల్ జిల్లా అద్యక్షుడు బోని శివరామకృష్ణ,  మైనార్టీ విభాగం నగర అద్యక్షుడు మహ్మద్ షరీఫ్, నగర అధికార ప్రతినిధి గుత్తుల నాగభూషణం, సేవాదళ్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మహిళా విభాగం నగర కార్యదర్శి శ్రీదేవివర్మ, సాంస్కృతిక విభాగం ప్రతినిధి రాధ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top