డోన్ మండలం ధర్మవరం గ్రామంలో ఆదివారం ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది.
వృద్ధురాలి ఆత్మహత్య
Jan 22 2017 11:39 PM | Updated on Nov 6 2018 7:53 PM
డోన్ టౌన్: డోన్ మండలం ధర్మవరం గ్రామంలో ఆదివారం ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. డోన్ రూరల్ ఎస్‌ఐ రామసుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాములమ్మ (60) శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో క్రిమిసంహారక మందు తాగింది. వెంటనే బంధువులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతిచెందింది. కుమారుడు బోయ రామచంద్రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కడుపునొప్పి తాళలేక వృద్ధురాలు మృతిచెందినట్లు విలేకరులకు వెల్లడించారు.
Advertisement


