గోదావరి అంత్యపుష్కరాల్లో బుధవారం భక్తుల స్నానాలకు వర్షం అడ్డంకిగా మారింది. తెల్లవారుజాము నుంచి జోరుగా వర్షం కురవడంతో రామన్నగూడెం ఘాట్ వద్దకు రావడానికి ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు కొందరు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. మహిళలు తమ మొక్కులను ఘాట్ వద్దనే సమర్పించుకున్నారు.
పుష్కర స్నానానికి వర్షం అడ్డంకి
Aug 4 2016 12:11 AM | Updated on Sep 4 2017 7:40 AM
ఏటూరునాగారం : గోదావరి అంత్యపుష్కరాల్లో బుధవారం భక్తుల స్నానాలకు వర్షం అడ్డంకిగా మారింది. తెల్లవారుజాము నుంచి జోరుగా వర్షం కురవడంతో రామన్నగూడెం ఘాట్ వద్దకు రావడానికి ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు కొందరు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. మహిళలు తమ మొక్కులను ఘాట్ వద్దనే సమర్పించుకున్నారు.
ఘాట్‌పై ఒండ్రుమట్టి పేరుకుపోవడంతో గ్రామస్తులు నీటితో శుభ్రం చేశారు. భక్తులు పితృదేవతలకు పిండప్రదానాలు చేసి గోదావరిలో కలిపారు.
Advertisement
Advertisement


