టీ కొట్టునూ వదల్లేదు..బాబు | ntr statue in three town area in vizag city | Sakshi
Sakshi News home page

టీ కొట్టునూ వదల్లేదు..బాబు

Sep 27 2016 8:27 AM | Updated on Sep 4 2017 3:14 PM

తోపుడు బండిపై ఆధారపడి బతుకుతున్న ఓ టీకొట్టు వ్యాపారి బతుకు బండి నెట్టి, ఓ బాబుగారు డాబు వెలగ బెడుతున్నారు.

విశాఖపట్నం : తోపుడు బండిపై ఆధారపడి బతుకుతున్న ఓ టీకొట్టు వ్యాపారి బతుకు బండి నెట్టి, ఓ బాబుగారు డాబు వెలగ బెడుతున్నారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ ప్రాంతంలో ప్రహరీ గోడ పక్కన.. మద్దిలపాలెం నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రోడ్డుకు వెళ్లే మార్గం మలుపులో ఉన్న టీ కొట్టును ఎట్టకేలకు తొలగించారు. బండి తీయిస్తే బతుకు పోతుందని ఆ యజమాని బతిమిలాడినా పట్టించుకోలేదు.
 
పంతం కోసం ఓ ‘పచ్చ’నాయకుడు పట్టుబట్టి మరీ బండి తొలగించేలా చేయించారు. తొలగించిన బండి స్థానంలో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా దాని చూట్టు ఉన్న పోలీస్ క్వార్టర్స్ ప్రహరీ గోడపై బారెడు సైజులో బాబుగారి బొమ్మలు పచ్చరంగులో గీసి మారి ఆర్భాటం చేస్తున్నారు. పచ్చనాయకులు చేస్తున్న ఆగడాలను చూస్తున్న స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు గారి ‘బొమ్మ’లు కనిపించేందుకేనా ఇంత ఆర్భాటమూ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement