
చైతన్య విద్యాసంస్థలకు 'కేశవరెడ్డి స్కూల్స్'
కేశవరెడ్డి స్కూల్స్ నిర్వహణను రాష్ట్రప్రభుత్వం చైతన్య విద్యాసంస్థలకు అప్పగించింది.
విజయవాడ: కేశవరెడ్డి స్కూల్స్ నిర్వహణను రాష్ట్రప్రభుత్వం చైతన్య విద్యాసంస్థలకు అప్పగించింది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. విద్యార్థుల అకడమిక్ నిర్వహణ మాత్రమే చైతన్య విద్యాసంస్థలకు అప్పగించామని, అయితే కేశవరెడ్డి ఆస్తులతో చైతన్య విద్యాసంస్థలకు సంబంధం ఉండదని స్పష్టం చేసింది.
కాగా డిపాజిట్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై ప్రముఖ విద్యాసంస్థల యజమాని నాగిరెడ్డి కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశవరెడ్డి యాజమాన్యం విద్యాసంస్థలను కొనసాగించే పరిస్థితి లేకపోవటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.