నిమిషం ఆలస్యమైనా అనుమతించం
ఈ నెల 22న పోలీసు కానిస్టేబుల్, 29న పోలీసు కానిస్టేబుల్ కమ్యూనికేషన్స్ మెయిన్స్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన అనుమతించమని జిల్లా ఆకే రవికృష్ణ తెలిపారు.
– 22న పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష
– హాల్ టికెట్‌తోపాటు ఆధార్‌కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపాలి
- ఏర్పాట్లపై సమీక్షలో జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 22న పోలీసు కానిస్టేబుల్, 29న పోలీసు కానిస్టేబుల్ కమ్యూనికేషన్స్ మెయిన్స్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన అనుమతించమని జిల్లా ఆకే రవికృష్ణ తెలిపారు. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సోమవారం పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షపై ఎస్పీ, పోలీసు కమాండ్ కంట్రోల్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన 16,800 మంది అభ్యర్థుల కోసం కర్నూలులో 27 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం పది నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని, అభ్యర్థులను ఉదయం 9 గంటలకు కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. సమాధానాలను బ్లాక్ లేదా బ్లూ పెన్నుతో మాత్రమే బ్లర్బు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోనికి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, ఇతర వస్తువులను అనుమతించమన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు ఆధార్‌కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపితేనే లోపలికి అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉండే జిరాక్స్ సెంటర్లు, హోటళ్లు, టైప్ ఇన్‌స్టిట్యూట్లు, నెట సెంటర్లను మూసి వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ రవిప్రకాష్, ఆడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, రీజినల్ కోఆర్డినేటర్ పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీలు రమణామూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, ఏఓ అబ్దుల్ సలాం, ఆర్‌ఐ రంగముని పాల్గొన్నారు.