ప్రజాస్వామ్యమా.. పోలీస్‌ రాజ్యమా? | No Permission For AP Special Status Meeting at RK Beach | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యమా.. పోలీస్‌ రాజ్యమా?

Jan 25 2017 2:15 AM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రజాస్వామ్యమా.. పోలీస్‌ రాజ్యమా? - Sakshi

ప్రజాస్వామ్యమా.. పోలీస్‌ రాజ్యమా?

జల్లికట్టు కోసం తమిళనాట అన్ని పార్టీలతో పాటు ప్రభుత్వం కూడా కలిసి ఉద్య మించి ఆర్డినెన్స్‌ తెచ్చుకోగలిగారు. కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేకహోదా

ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి నిరాకరణపై బొత్స ధ్వజం

సాక్షి, విశాఖపట్నం:  ‘‘జల్లికట్టు కోసం తమిళనాట అన్ని పార్టీలతో పాటు ప్రభుత్వం కూడా కలిసి ఉద్య మించి ఆర్డినెన్స్‌ తెచ్చుకోగలిగారు. కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేకహోదాకోసం ఆంధ్రులంతా గళమెత్తుతుంటే, ఉద్యమిస్తుం టే అనుమతులివ్వరా? మనం ప్రజా స్వామ్యం లో ఉన్నామా? పోలీసు రాజ్యంలో ఉన్నామా? మీ ఆలోచన ఏమిటి? రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు?  పక్క రాష్ట్రా లను చూసైనా బుద్ధి రాదా మీకు?’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై విరుచుకు పడ్డారు.

ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ నెల 26న శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేసుకోవడానికి అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధించడంపై మండి పడ్డారు. ఎవరెన్ని ఆంక్షలు విధించినా తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కొవ్వొత్తుల ర్యాలీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.   కొవ్వొత్తుల ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లా డారు. ర్యాలీ సందర్భంగా  అవాంఛనీయ సంఘటనలు జరిగితే పూర్తి బాధ్యత వహిస్తా మని వైఎస్సార్‌సీపీ చెబుతున్నా ఎందుకు అనుమతివ్వడంలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.    

పార్టీనే పణంగా పెట్టాం...
ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్‌ జగన్‌ పార్టీని పణంగా పెట్టి పోరాడు తున్నారని అంతకుముందు బొత్స చెప్పారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ విశ్రమించ బోమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే అంశాన్ని పార్టీ ప్రధాన ఎజెండాగా చేరుస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న వారికే కేంద్రంలో తమ పార్టీ మద్దతునిస్తుందంటూ జగన్‌ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు.  26వ తేదీన విశాఖపట్నంలో ఆర్‌కే బీచ్‌ నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీని శాంతి యుతంగా నిర్వహించాలని తమ అధినేత పిలుపునిచ్చారని చెప్పారు. కాగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై తొలిరోజే చర్చ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు డిమాండ్‌ చేశారు. హోదా కావా లని అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, ఇప్పుడు ప్యాకేజీయే మిన్న అని ఎలా అంటున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement