వెలగపూడిలో ఎన్టీఆర్ క్యాంటీన్ | New NTR Canteens to be opened soon | Sakshi
Sakshi News home page

వెలగపూడిలో ఎన్టీఆర్ క్యాంటీన్

Jun 14 2016 8:23 PM | Updated on Sep 4 2017 2:28 AM

నూతన రాజధాని వెలగపూడిలోఈ నెలాఖరున ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ క్యాంటీన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు.

విజయవాడ : నూతన రాజధాని వెలగపూడిలోఈ నెలాఖరున ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ క్యాంటీన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో క్యాంటీన్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎన్టీఆర్ క్యాంటీన్లపై మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే నెలలో మరో రెండు ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

సీఆర్‌డీఏ పరిధిలో వీటి నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించామని తెలిపారు. క్యాంటీన్ల కోసం ఇప్పటికే స్థలసేకరణ పూర్తయిందని, ఒకచోట వంటశాల ఏర్పాటుచేసి అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన క్యాంటీన్లకు పంపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తామన్నారు. అల్పాహారంలో ఇడ్లీ-సాంబార్, పొంగల్ మధ్యాహ్నం భోజనంగా లెమన్ రైస్, సాంబార్ రైస్, పెరుగన్నం ఇస్తామన్నారు. మంత్రుల కమిటీ చేసిన ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రికి వివరిస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement