breaking news
NTR canteen
-
వెలగపూడిలో ఎన్టీఆర్ క్యాంటీన్
విజయవాడ : నూతన రాజధాని వెలగపూడిలోఈ నెలాఖరున ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ క్యాంటీన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో క్యాంటీన్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎన్టీఆర్ క్యాంటీన్లపై మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే నెలలో మరో రెండు ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీఆర్డీఏ పరిధిలో వీటి నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించామని తెలిపారు. క్యాంటీన్ల కోసం ఇప్పటికే స్థలసేకరణ పూర్తయిందని, ఒకచోట వంటశాల ఏర్పాటుచేసి అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన క్యాంటీన్లకు పంపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తామన్నారు. అల్పాహారంలో ఇడ్లీ-సాంబార్, పొంగల్ మధ్యాహ్నం భోజనంగా లెమన్ రైస్, సాంబార్ రైస్, పెరుగన్నం ఇస్తామన్నారు. మంత్రుల కమిటీ చేసిన ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రికి వివరిస్తామని చెప్పారు. -
35 క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం
-
ఎన్టీఆర్ క్యాంటీన్లో నిత్యం లక్ష మందికి భోజనం
ఏపీలోని 4 జిల్లాల్లో త్వరలోనే ప్రారంభిస్తామన్న మంత్రివర్గ ఉపసంఘం ఏటా రూ.160 కోట్ల వ్యయ భారం పడుతున్నప్పటికీ భరిస్తామని వెల్లడి 35 క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి చపాతీ సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ‘అమ్మ క్యాంటీన్’ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎన్టీఆర్ క్యాంటీన్’లకు ప్రభుత్వం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి విస్తృత పరిశీలన అనంతరం.. క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. పేదలకు అతి తక్కువ ధరలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి చపాతీ అందించేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ‘ఎన్టీఆర్ క్యాంటీన్’లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు పి. నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయా వివరాలను మీడియాకు వెల్లడించారు. క్యాంటీన్ల నిర్వహణకు ఏటా 160 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్ల ద్వారా నిత్యం లక్ష మంది పేదలకు అతి తక్కువ ధరలకే అల్పాహారం, భోజనాలను అందించనున్నట్టు తెలిపారు. ప్రయోగాత్మకంగా తొలుత 4 జిల్లాల్లో 35 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో 15, గుంటూరులో 10, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 5 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క్యాంటీన్లలో ఉదయం ఇడ్లీ, పొంగల్, ఉప్మా మధ్యాహ్నం పులిహోర, సాంబారు, పెరుగన్నం, రాత్రికి చపాతీలు, వె జ్ కర్రీ ఉంటాయని తెలిపారు. వీటి నిర్వహణను స్వయం సహాయక బృందాలు, ఇస్కాన్, నంది, ఎన్జీఓలకు అప్పగించాలన్న విషయంపై ఆలోచిస్తున్నామని, సోమవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.