
గ్రామీణ ప్రగతిపై నూతన యాప్
గ్రామీణ ప్రగతిపై ఒక యాప్‌ను తయారు చేసేందుకు జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సన్నాహాలు చేస్తున్నట్టు డాక్టర్ పి.సత్యనారాయణ అన్నారు.
దీనికిగాను సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సత్యనారాయణ చెప్పారు. రెండోదశలో కొన్ని జిల్లాలు, మూడో దశలో అన్ని జిల్లాలను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే 70 జిల్లాల్లో యాప్ తయారుచేయడం పూర్తయిందన్నారు. అనంతరం కళాశాలలోని వెట్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్‌ఎన్ రాజు, డైరెక్టర్ సాగి విఠల్‌రంగరాజు, స్పేస్ టెక్నాలజీ సెంటర్ కో–ఆరి్డనేటర్ డాక్టర్ వైఎస్‌ఎస్‌ఆర్ మూర్తి, ఆర్‌అండ్‌డీ డీన్ డాక్టర్ పీఏ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.