నాగాయలంకలో నెదర్లాండ్, ఆస్ట్రేలియా విద్యార్థులు | netherland students at nagayalanka | Sakshi
Sakshi News home page

నాగాయలంకలో నెదర్లాండ్, ఆస్ట్రేలియా విద్యార్థులు

Oct 23 2016 11:08 PM | Updated on Oct 3 2018 5:26 PM

నాగాయలంకలో నెదర్లాండ్, ఆస్ట్రేలియా విద్యార్థులు - Sakshi

నాగాయలంకలో నెదర్లాండ్, ఆస్ట్రేలియా విద్యార్థులు

నెదర్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన విద్యార్థులు ఆదివారం సాయంత్రం నాగాయలంకను సందర్శించారు. ఆయా దేశాల్లో పదో తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థులు నదీ పరిశీలన కోసం ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్‌లో వారం రోజుల నుంచి సొంతగా తయారు చేసిన నాలుగు పడవలను ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి నదిలో విహరించారు.

నాగాయలంక : నెదర్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన విద్యార్థులు ఆదివారం సాయంత్రం నాగాయలంకను సందర్శించారు. ఆయా దేశాల్లో పదో తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థులు నదీ పరిశీలన కోసం ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్‌లో వారం రోజుల నుంచి సొంతగా తయారు చేసిన నాలుగు పడవలను ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి నదిలో విహరించారు. ఈ బోటులో పయనిస్తూ అలల తాకిడి, గాలుల తీవ్రత, నదిలో మత్స్య సంపదను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక బోటులో లైట్‌హౌస్, మడ అడవుల పరిశీలన కోసం వెళ్లారు. చల్లపల్లి ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖరప్రసాద్‌ (లంకబాబు), ఏఎంసీ చైర్మన్‌ మండవ బాలవర్ధిరావు, కో–ఆర్డినేటర్లు నరేంద్ర, శ్రీనివాస్‌  కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.






 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement