పెద్దాపురంలో ముగిసిన ఎన్‌సీసీ శిక్షణ శిబిరం | ncc cadet training closed | Sakshi
Sakshi News home page

పెద్దాపురంలో ముగిసిన ఎన్‌సీసీ శిక్షణ శిబిరం

Jun 28 2017 11:02 PM | Updated on Sep 5 2017 2:42 PM

పెద్దాపురంలో ముగిసిన ఎన్‌సీసీ శిక్షణ శిబిరం

పెద్దాపురంలో ముగిసిన ఎన్‌సీసీ శిక్షణ శిబిరం

పెద్దాపురం : కాకినాడ 18వ ఆంధ్రాబెటాలియన్‌ ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాలలో నిర్వహించిన ఎన్‌సీసీ శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్‌ కమాండెంట్‌ మునీష్‌గౌర్‌ ఆధ్వర్యంలో క్యాంపు ముగిం

–జాతీయ సమైక్యతకు ఎన్‌సీసీ దోహదమన్న వక్తలు
పెద్దాపురం : కాకినాడ 18వ ఆంధ్రాబెటాలియన్‌ ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాలలో నిర్వహించిన ఎన్‌సీసీ శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్‌ కమాండెంట్‌ మునీష్‌గౌర్‌ ఆధ్వర్యంలో క్యాంపు ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు సిక్స్‌ నేవల్‌ కమాండ్‌ అధికారి కెప్టెన్‌ వివేకానంద, కల్నల్‌ నీలేష్, మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు, శ్రీ ప్రకాష్‌ పాఠశాల డైరెక్టర్‌  సీహెచ్‌ విజయ్‌ప్రకాష్, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ వి.మునిరామయ్య ముఖ్యఅతిథలుగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. జాతీయ సమైక్యతను చాటేందుకు ఎన్‌సీసీ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. క్యాంపు ఎన్‌సీసీ అధికారులు ఉప్పలపాటి మాచిరాజు ఆధ్వర్యంలో క్యాడెట్లు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాడెట్లకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ తాళ్లూరి వీరభద్రరావు, మాజీ ప్రిన్సిపాల్‌ ప్రభాకరరావు, ఎన్‌సీసీ అధికారులు కృష్ణారావు, సతీష్, సత్యనారాయణ, పిలిఫ్‌రాజు, వీవీవీ రమణమూర్తి, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement