ఉద్యోగులకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసేవరకు పోరాడతామని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షన్మూర్తి అన్నారు.
సీపీఎస్ రద్దుకు జాతీయ స్థాయిలో పోరాటం
Nov 6 2016 11:41 PM | Updated on Sep 4 2017 7:23 PM
కర్నూలు సిటీ: ఉద్యోగులకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసేవరకు పోరాడతామని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షన్మూర్తి అన్నారు. స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ వల్ల ఉపాధ్యాయుడు చనిపోయినా, పదవి విరమణ పొందినా ఆర్థిక ప్రయోజనం అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ విధానం రద్దు కోసం చేస్తున్న పోరాటాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా డీల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేశామని, అయినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదన్నారు. జాతీయ అధికార, ప్రతిపక్ష పార్టీ దృష్టికి తీసుకెళ్లి పోరాటాలు చేస్తామని ప్రకటించారు. సర్వీస్ రూల్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఆదర్శ స్కూల్ టీచర్ల సమస్యలపై కూడా పోరాడతామన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవలే ఎన్నికైన షన్మూర్తిని జిల్లా కమిటీ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌రెడ్డి, తిమ్మన్న, గౌరవాధ్యక్షులు రమేష్, ట్రెజరర్ గోకారి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement