జాతీయ స్థాయి పోటీలకు ‘శ్రీప్రకాష్‌’ విద్యార్థి | national football compitations selected | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు ‘శ్రీప్రకాష్‌’ విద్యార్థి

Oct 3 2016 10:24 PM | Updated on Sep 4 2017 4:02 PM

జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు పెద్దాపురం శ్రీ ప్రకాష్‌ సినర్జీ పాఠశాల విద్యార్థి డి.సత్యనారాయణ ఎంపికైనట్టు పాఠశాల డీన్‌ రాజేశ్వరి తెలిపారు.

పెద్దాపురం : 
జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు పెద్దాపురం శ్రీ ప్రకాష్‌ సినర్జీ పాఠశాల విద్యార్థి డి.సత్యనారాయణ ఎంపికైనట్టు పాఠశాల డీన్‌ రాజేశ్వరి తెలిపారు. సోమవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గత నెలలో తిరుపతి వేంకటేశ్వర విద్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించాడన్నారు. సత్యనారాయణను పాఠశాల డైరెక్టర్‌ సీహెచ్‌.విజయ్‌
ప్రకాష్, అధ్యాపక బృందం, లైజాన్‌ ఆఫీసర్‌ ఎం.సతీష్‌ అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement