నారాయణ.. నీ పదవి కాపాడుకో | Narayana..save your minister post | Sakshi
Sakshi News home page

నారాయణ.. నీ పదవి కాపాడుకో

Jul 25 2016 11:31 PM | Updated on Sep 4 2017 6:14 AM

నారాయణ.. నీ పదవి కాపాడుకో

నారాయణ.. నీ పదవి కాపాడుకో

నెల్లూరు(మినీబైపాస్‌): గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణ చూసి మంత్రి నారాయణకు దిక్కుతోచని స్థితిలో వైఎస్సార్‌సీపీపై మాట్లాడుతున్నాడని, ముందు నీకు మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలుసుకుని జాగ్రత్తపడమని మంత్రి నారాయణకు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిశ్రీధర్‌రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ రూరల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి విలేకరుల సమావేశం మాట్లాడారు.

  • పార్టీ భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయించేది ప్రజలే 
  • రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి  
  • నెల్లూరు(మినీబైపాస్‌): గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణ చూసి మంత్రి నారాయణకు దిక్కుతోచని స్థితిలో వైఎస్సార్‌సీపీపై మాట్లాడుతున్నాడని, ముందు నీకు మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలుసుకుని జాగ్రత్తపడమని మంత్రి నారాయణకు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిశ్రీధర్‌రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ రూరల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి విలేకరుల సమావేశం మాట్లాడారు. రాష్ట్ర మంత్రుల సమర్థత, పని తీరులో మంత్రి నారాయణకు ఆఖరి స్థానం దక్కడం ఆయన చేత గాని పనికి నిదర్శనమన్నారు.  మంత్రి నారాయణ, మేయర్‌  అబ్దుల్‌ అజీజ్‌ గురు శిష్యులిద్దరూ అసమర్థ పాలనతో కార్పొరేషను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కార్పొరేషన్‌ను రూ.1200 కోట్ల అప్పుల పాలు చేశారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ కనుమరుగు కావాలంటే కాలేజీలు  ప్రారంభించి ఎత్తేయడం అంత సులభతరం  కాదని ఎద్దేవ చేశారు. వైఎస్సార్‌సీపీ భవిష్యత్‌ను నిర్దేశించేది నీలాంటి అసమర్థులు కారని, విజ్ఞులైన ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మంత్రిగా చేతనైతే వైఎస్సార్‌నగర్‌లో పేదలకు నిర్మించి ఇస్తానన్న ఇళ్లను పూర్తి చేయాలని, సమ్మర్‌ స్టోరీజీ ద్వారా మంచినీటిని అందించాలని కోరారు. నగరంలో ఇష్టానుసారంగా ఆక్రమణల పేరుతో ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చడం దారుణమన్నారు. ఇళ్లు నిర్మించమని ప్రజలు అడుగుతుంటే ఉన్న వాటిని తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను, సంక్షుమ పథకాలను అమలు పరచడంలో విఫలం కావడంతో ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సమావేశంలో 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement