ఆకట్టుకున్న నల్లజర్ల రోడ్డు | nallajarla road interesting | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న నల్లజర్ల రోడ్డు

Feb 12 2017 12:19 AM | Updated on Sep 5 2017 3:28 AM

ఆకట్టుకున్న నల్లజర్ల రోడ్డు

ఆకట్టుకున్న నల్లజర్ల రోడ్డు

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ఏలూరుకు చెందిన గరికపాటి ఆర్ట్స్‌ థియేటర్‌ ఆధ్వర్యంలో 5వ వార్షిక నాటిక పోటీలు సందేశాత్మక ప్రదర్శనలతో ఆహూతులను ఆకట్టుకున్నాయి.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ఏలూరుకు చెందిన గరికపాటి ఆర్ట్స్‌ థియేటర్‌ ఆధ్వర్యంలో 5వ వార్షిక నాటిక పోటీలు సందేశాత్మక ప్రదర్శనలతో ఆహూతులను ఆకట్టుకున్నాయి. స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో రెండోరోజు శనివారం ప్రదర్శించిన నాటికల్లో నల్లజర్ల రోడ్డు, కృష్ణబిళం, దగ్ధగీతం నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ ఆఫీసర్‌ పి.సీతారామారావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ వై.సాయిశ్రీకాంత్, గుప్త విద్యా దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షుడు తల్లాప్రగడ సుబ్బారావు, గరికపాటి సంస్థ అధ్యక్షుడు గరికపాటి కాళిదాసు, మైలవరపు గురుశర్మ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement