నిందితుడికి సహకరించాడనే శ్రీనివాస్‌ హత్య


  • 12 రోజుల్లో హత్య కేసు ఛేదించిన పెద్దాపురం పోలీసులు

  • ఆరుగురు అరెస్టు

  • తపంచా, నాలుగు బైక్‌లు స్వాధీనం

  • పెద్దాపురం : 

    సుమారు 12 రోజుల కిందట ప్రత్తిపాడు–సామర్లకోట రహదారిలో  గోరింట–పులిమేరు గ్రామాల మధ్య జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్త బర్రే శ్రీనివాస్‌ హత్య మిస్టరీని పెద్దాపురం పోలీసులు ఛేదించారు. గత ఏడాది పెద్దాపురం వైస్‌ ఎంపీపీ గోపు సతీష్‌ రాజా హత్య కేసులో నిందితులకు సహకరించాడన్న కారణంగా కాంగ్రెస్‌ కార్యకర్త శ్రీనివాస్‌ను హత్య చేసిన వివరాలను  సోమవారం రాత్రి అడిషనల్‌ ఎస్పీ ఏఆర్‌ దామోదర్, పెద్దాపురం డీఎస్పీ రాజశేఖరరావు, సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్‌లతో కలిసి స్థానిక విలేకర్లకు తెలిపారు. పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన బర్రే శ్రీనివాస్‌ అదే గ్రామానికి చెందిన దివంగత వైస్‌ ఎంపీపీ సతీష్‌ రాజాను హత్య చేసిన కొప్పిరెడ్డి అచ్చిరాజుకు సహకరించడంతో అదే గ్రామానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు పాల్పడ్డారు. తాటిపరి్తకి చెందిన కొమ్మిరెడ్డి వరహా కొండలరావు అలియాస్‌ బుజ్జి అదే గ్రామానికి చెందిన బండి మహేష్‌కుమార్, కందుకూరి నాగేంద్ర, కందుకూరి శ్రీను, సమ్మిటి సూర్య గంగాధర్‌తో కలిసి శ్రీనివాస్‌ హత్యకు పథకం పన్నారు. మహేష్‌తో పరిచయం ఉన్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తెంబూరు గ్రామానికి చెందిన మామిడి ధనుంజయరావుతో కలిసి మూడు లక్షల రూపాయలకు హత్య చేయడానికి బేరం కుదుర్చుకుని 30 వేల రూపాయలు అడ్వా¯Œ్సగా ఇచ్చారు. పథకం ప్రకారం ఈ నెల 12వ తేదీన కాకినాడ వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న శ్రీనివాస్‌ను వెంబడిస్తూ బుజ్జి ఎప్పటికప్పుడు ధనుంజయరావు, మహేష్, నాగేంద్ర, గంగాధర్‌లకు వడ్లమూరులోని వై¯ŒS షాపు వద్ద కాపలా ఉన్న వారికి  సమాచారం అందించేవాడు. అటుగా సెల్‌ఫో¯ŒSలో మాట్లాడుతూ వస్తున్న శ్రీనివాస్‌ దుకాణం దాటగానే శ్రీను, గంగాధర్‌లు అతని బైక్‌ను ఓవర్‌టేక్‌ చేసి ఆపారు. వెనుక నుంచి ధనుంజయరావు తల వెనుక తుపాకి ఉంచి ఒక రౌండ్‌ కాల్చగా శ్రీనివాస్‌ బైక్‌ నుంచి కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. అక్కడ నుంచి పరారైన ఆరుగురినీ సీఐ వీరయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు ఏఎస్పీ దామోదర్‌ తెలిపారు. వారి నుండి ఒక తపంచా, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకుని ఆరుగురుని కోర్టుకు తరలించనున్నామన్నారు. కేసును 12 రోజుల్లో ఛేదించిన సీఐ వీరయ్యగౌడ్, హెచ్‌సీలు వై.కృష్ణ, పీవీ కుమార్, వి.విజయ్‌బాబు, కె.జయకుమార్, ఐ.గణేష్, ఎ¯ŒS.శ్రీనివాస్‌ చౌదరి, ఎంఎస్‌బి విజయ్‌లకు ఎస్పీ రివార్డులు ప్రకటించారు. ఎస్‌ఐలు కృష్ణభగవాన్, ఎం.ఏసుబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

     

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top