హత్యకేసులో ఇద్దరి అరెస్ట్‌ | murder csae.. two persons arrest | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ఇద్దరి అరెస్ట్‌

Sep 16 2016 1:56 AM | Updated on Aug 20 2018 4:37 PM

కామవరపుకోట : హత్య కేసులో ఇద్దరు యువకులను గురువారం అరెస్ట్‌ చేసినట్లు తడికలపూడి ఏఎస్సై డి.ఎ.దీక్షితులు తెలిపారు.

కామవరపుకోట : హత్య కేసులో ఇద్దరు యువకులను  గురువారం అరెస్ట్‌ చేసినట్లు తడికలపూడి ఏఎస్సై డి.ఎ.దీక్షితులు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంకు చెందిన వీరవల్లి వీరాస్వాములుకు, మరికొందరికి గత మంగళవారం కోడిపందేల సందర్భంగా ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో వీరాస్వాములు హత్యకు గురయ్యాడు. దీంతో కామవరపు కోట పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెంకు చెందిన జోడాల గిరిబాబు, కొండగూడెంకు చెందిన బిరుదుగడ్డ మోహనరావు అనే ఇద్దరు యువకులను కామవరపు కోట బస్‌స్టాండ్‌ వద్ద చింతలపూడి సీఐ జి.దాసు.అరెస్ట్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement