శతాధిక వృద్ధురాలి కన్నుమూత | More than hundred years old elderly passed away | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలి కన్నుమూత

Aug 8 2016 8:15 PM | Updated on Aug 24 2018 2:36 PM

రాజుపాలెం మండలం అంచులవారిపాలెంలో శతాధిక వృద్ధురాలు కన్నుమూసింది.

రాజుపాలెం మండలం అంచులవారిపాలెంలో శతాధిక వృద్ధురాలు కన్నుమూసింది. అనారోగ్యానికి గురైన గ్రామానికి చెందిన వేపూరి లక్ష్మీదేవమ్మ (115) సోమవారం మృతిచెందింది. ఆమెకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వారికి 32 మంది సంతానం ఉన్నారు. ఆమె నాలుగో తరాన్ని కూడా చూసినట్టు గ్రామస్తులు చెప్పారు. 2014లో విజయవాడలోని బెజవాడ వయోవృద్ధుల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 113 ఏళ్లు నిండడంతో లక్ష్మీదేవమ్మకు సన్మానం చేశారు. ఇప్పటికే భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె చనిపోయారు. జెడ్పీటీసీ సభ్యుడు మర్రి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీపీ మర్రి సుందరరామిరెడ్డి, బాసు లింగారెడ్డి, మాజీ సర్పంచ్ మర్రి సుబ్బారెడ్డి, పలువురు గ్రామస్తులు లక్ష్మీదేవమ్మకు నివాళులు అర్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement