మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలి | mobility should be brought in minorities | Sakshi
Sakshi News home page

మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలి

May 15 2017 10:54 PM | Updated on Sep 5 2017 11:13 AM

మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలి

మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలి

విద్య పట్ల రాష్ట్రంలోని మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలని సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర స్థాయి అధికారి డాక్టర్‌ షేక్‌ నాసర్‌ సాహెబ్‌ అన్నారు.

కర్నూలు సిటీ: విద్య పట్ల రాష్ట్రంలోని మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలని సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర స్థాయి అధికారి డాక్టర్‌ షేక్‌ నాసర్‌ సాహెబ్‌ అన్నారు. సోమవారం నగరంలో ఉర్దూ టీచర్లకు ఆరు రోజుల పాటు రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమైయ్యాయి. ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మైనార్టీల్లో అధిక శాతం నిరక్షరాస్యులు ఉన్నారని, వారిని అక్షరాస్యులుగా మార్చాల్సిన బాధ్యత ఉర్దూ టీచర్లపై ఉందన్నారు. రాష్ట్రంలోని కస్తూర్బా పాఠశాలల్లో 3600 సీట్లు ఉంటే 2600 ఖాళీగానే ఉన్నాయన్నారు. ఎస్‌ఎస్‌ఏ సీమెట్‌ అధ్యాపకుడు  ప్రసాద్‌రావు, ఎస్‌ఎస్‌ఏ పీడీ రామచంద్రారెడ్డి, ఏఎంఓ మాలిబాషా, చిత్తూరు ఏఎంఓ మహ్మాద్‌ఖాన్, సీఎంఓ జయరామకృష్ణారెడ్డి, అసిస్టెంట్‌ ఏఎంఓ రఫీ, తదితరులు పాల్గొన్నారు.
 
విద్యార్థులపై ‘ప్రత్యేక’ శ్రద్ధ  
            మా స్కూల్‌లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఉపాధ్యాయులందరూ నమన్వయంతో పని చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలకు ఇది ఒక కారణం. నేను ఇక్కడ ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాను. వరుసగా ఆరేళ్లు పదోతరగతిలో వంద శాతం ఫలితాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. 
   – వాడాల సుబ్బరాయుడు యాదవ్, కునుకుంట్ల జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement