రోజురోజుకీ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎందరో చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోనుతో కనిపిస్తున్నారు. ఇక నగరాల్లో ఉన్న కుటుంబాల్లో ఆండ్రాయిడ్ ఫోను లేని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. కొంత మంది
-
ఇంటర్‌నెట్‌లో చేటు తెచ్చే వెబ్ సైట్లెన్నో..
-
వాటి విషప్రభావంతో దుష్పరిణామాలు
-
అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
గాంధీనగర్ (కాకినాడ) :
రోజురోజుకీ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎందరో చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోనుతో కనిపిస్తున్నారు. ఇక నగరాల్లో ఉన్న కుటుంబాల్లో ఆండ్రాయిడ్ ఫోను లేని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. కొంత మంది తల్లిదండ్రులు చిన్నారులకు కూడా గేమ్‌లు ఆడడానికి ఫోన్లను ఇస్తున్నారు. కౌమార దశలో ఉన్న విద్యార్థులకు తల్లిదండ్రులే స్వయంగా ప్రత్యేక ఫోన్లను కొనిస్తున్నారు. ఇదిలా ఉంచితే ఫోన్ల వాడకం అన్ని వేళలా మంచిది కాదని మానసిక వైద్యులు చెబుతున్నారు. పదో తరగతి లోపు విద్యార్థులు, యుక్త వయసులో ఉన్న వారిపై ఈ ఫోన్లు చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని వారు వెల్లడిస్తున్నారు.
ఎలా వాడుతున్నారో ఓ కన్నేయాలి..
పిల్లలకు కొత్తగా ఆండ్రాయిడ్ కొనివ్వాలనుకొంటున్నారా? అయితే ఒక నిమిషం ఆలోచించండి. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ పిల్లలు ఆ ఫోన్లతో ఏం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ¯ŒSలై¯ŒSలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే అనేక రకాల అనవసర వెబ్‌సైట్లు ఓపె¯ŒS అవుతుంటాయి. అందులో మంచి కంటే చెడు విషయాలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమస్యలను అధిగమించడానికి ఉచితంగా లభించే అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తమ ఫోన్లలో ఇ¯ŒSస్టాల్ చేసుకోవడం ద్వారా అనవసరమైన వెబ్‌సైట్లను అరికట్టేందుకు వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
నియంత్రణకూ ఉంది ఓ యాప్..
‘కిడ్స్ జో¯ŒS పేరెంటల్ కంట్రోల్’ అనే అప్లికేష¯ŒSతో తమ స్మార్ట్‌ఫోన్లను పిల్లలు వాడకుండా తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. ఇది మంచి తాళంగా పనిచేస్తుంది. ఇందులో వేటినైతే మనం ఓపె¯ŒS చేయాలనుకుంటామో ముందుగానే నమోదు చేయాలి. దీంతో వేరే సైట్లు ఓపె¯ŒS కాకుండా ఉంటాయి. ఇంటర్నెట్ సౌకార్యాన్ని కూడా దీని ద్వారా ఆపేయవచ్చు. పిల్లలు తమకు తెలియకుండా యాప్స్ ఇ¯ŒSస్టాల్ లేదా గేమ్స్ డౌ¯ŒSలోడ్ చేసినా అవి యాక్టివేట్ అవ్వవు. అప్‌గ్రేడ్ వెర్ష¯ŒS ఇ¯ŒSస్టాల్ చేసుకొని ప్రొఫైల్స్ కూడా రూపొందించుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌ¯ŒSలోడ్ చేసుకొని వినియోగించవచ్చు.
వాడకం సమయాన్నీ
పరిమితం చేయవచ్చు..
‘స్క్రీ¯ŒS టైం’ అనే యాప్ ద్వారా సమయాన్ని పరిమితం చేసి పిల్లలు తక్కువ సమయమే ఫోను వినియోగించేలా చేయవచ్చు. పిల్లలకు ఫోను ఇచ్చే ముందు ఈ యాప్ ద్వారా నిర్ణీత సమయం నమోదు చేసి వారికి ఇవ్వాలి. ఇచ్చిన సమయం అయిపోగానే ఫోను దానంతట అదే ఆగిపోతుంది. ఫోనులో గేమ్స్ ఆడే పిల్లలకు ఈ యాప్ ద్వారా నిర్ణీత సమయాన్ని కేటాయించి ఇవ్వవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌ¯ŒSలోడ్ చేసుకొని వినియోగించవచ్చు.