
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శిగా శేషుబాబు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నియమితులయ్యారు. శేషుబాబు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నియమితులయ్యారు. శేషుబాబు ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. కాగా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాలకొల్లు నియోజకవర్గ సింగిల్ కో–ఆర్డినేటర్‌గా గుణ్ణం నాగబాబుని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.