ఆత్మకూర్ : జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వద్ద చేపట్టారు.
నట్టల నివారణ మందుల పంపిణీ
Aug 12 2016 5:52 PM | Updated on Oct 16 2018 3:26 PM
ఆత్మకూర్ : జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వద్ద చేపట్టారు. క్లస్టర్ ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు, హెల్త్ ఎడుకేటర్ శ్రీరామ్‌సుధాకర్ మాటాడుతూ క్లస్టర్ పరిధిలో 72వేలమంది విద్యార్థులకు, ఆత్మకూర్ మండలంలో 32వేలమంది విద్యార్థులకు ఆల్‌బెండోజోల్ మాత్రలు 1నుంచి 19సంవత్సరాల వయస్సు ఉన్నవారికి పంపిణీ చేశామని అన్నారు. రక్తహీనత, పోషకాహార లోపం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం వ్యాధి లక్షణాలుగా తెలిపారు. కార్యక్రమంలో డీపీఎంఓ హన్మంత్‌రావు, వైద్య సిబ్బంది రామునాయక్, సామ్రాజ్యలక్ష్మి, శైలజదేవి, సురేందర్‌గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement