సెమీ ఫైనల్లో మెదక్‌ జట్టు | Medak team in the semi-finals | Sakshi
Sakshi News home page

సెమీ ఫైనల్లో మెదక్‌ జట్టు

Sep 8 2016 8:37 PM | Updated on Oct 8 2018 7:44 PM

అండర్‌ 19 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నీలో భాగంగా గురువారం స్థానిక అంబేద్కర్‌ మైదానంలో జరిగిన మెదక్, నల్లగొండ మ్యాచ్‌లో మెదక్‌ ఘన విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.

  • అండర్‌ 19 అంతర్‌ జిల్లా క్రికెట్‌ టోర్నీ
  • మహబూబ్‌నగర్‌లో సెమీ ఫైనల్స్‌
  • సంగారెడ్డి టౌన్‌: అండర్‌ 19 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నీలో భాగంగా గురువారం స్థానిక అంబేద్కర్‌ మైదానంలో జరిగిన మెదక్, నల్లగొండ మ్యాచ్‌లో మెదక్‌ ఘన విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్‌ చేసిన నల్లగొండ 118 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ జట్లు 8 వికెట్లకు 120 పరుగు చేసి ఘన విజయం సాధించింది. పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో వరంగల్, ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వరంగల్‌ 259 పరుగులతో భారీ తేడాతో గెలిచింది.

    మొదట బ్యాటింగ్‌ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. వరంగల్‌ జట్టులో రఘు సెంచరీ చేయడం విశేషం. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఖమ్మం 77 పరుగులకు అలౌట్‌ అయింది. వరంగల్‌ జట్టు ఇంతకు ముందే సెమీ ఫైనల్లో అడుగిడిన విషయం విదితమే.  మెదక్, వరంగల్‌ జట్లు ఈ నెల 10 మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగే సెమీ ఫైనల్స్‌లో తలపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement