ఇంటి యజమాని కన్నేశాడని.. | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

ఇంటి యజమాని కన్నేశాడని..

Apr 22 2016 12:40 PM | Updated on Nov 6 2018 7:56 PM

మనసిక వేదనకు గురై ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత పై ఇంటి యజమాని కన్నేశాడు. ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు అదును చూసి ఆమె పై అత్యాచారయత్నం చేశాడు. దీంతో కేకలు వేసి అక్కడి నుంచి పరారైన మహిళ అనంతరం.. ఇరుగు పొరుగుల సూటి పోటి మాటలు తట్టుకోలేక.. మనసిక వేదనకు గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని నల్లబండ బజార్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సుబ్బరత్నాలు, ఈశ్వరమ్మ(24) దంపతులు కూలి పనులు చేసుకుంటూ.. మొద్దు రాంరెడ్డి(60) ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న రాంరెడ్డి ఈశ్వరమ్మపై కన్నేశాడు.

 

గురువారం ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు లోపలికి వెళ్లి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె నిరాకరించడంతో.. అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆమె కేకలు వేసి పరుగులు తీసింది. అనంతరం గురువారం రాత్రి ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో స్థానికులు ఆమెను సూటి పోటి మాటలతో హింసించడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement