లక్ష్యసాధనకు మరింత కష్టపడి పని చేయాలని మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.సుధాకర్ కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు.
అనంతపురం: లక్ష్యసాధనకు మరింత కష్టపడి పని చేయాలని మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.సుధాకర్ కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం స్థానిక మార్కెటింగ్‌శాఖ ఏడీ కార్యాలయంలో 13 మార్కెట్‌యార్డుల కార్యదర్శులు, సూపర్‌వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మార్కెటింగ్ ఫీజు వసూళ్లలో వెనుకబడిన మార్కెట్‌యార్డుల్లో లక్ష్యసాధన చర్యలు వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుత 2016-17లో వివిధ రూపాల్లో రూ.16.74 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని యార్డుల వారీగా లక్ష్యం నిర్ధేశించుకోగా మొదటి రెండు నెలలకు సంబంధించి రూ.1.71 కోట్లు వసూలైందన్నారు. అందులో గుంతకల్లు, తనకల్లు, హిందూపురం, పెనుకొండ యార్డుల పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా తాడిపత్రి బాగా వెనుకబడిందన్నారు. యార్డులు, చెక్‌పోస్టుల పటిష్టతకు ఎప్పటికపుడు చర్యలు తీసుకోవాలన్నారు. యార్డుల్లో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు మెరుగు పరచ్చాలన్నారు. పండ్లను మాగబెట్టడానికి నిషేధిత కాల్షియం కార్బైడ్ వాడకుండా రైపనింగ్ ఛాంబర్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీడీఎం వెంకటసుబ్బన్న, ఏడీఎం బి.హిమశైల తదితరులు పాల్గొన్నారు.