యువకుడి దారుణహత్య | man murdered in kaluvapalli | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణహత్య

Jul 23 2017 7:52 PM | Updated on Jul 30 2018 8:37 PM

యువకుడి దారుణహత్య - Sakshi

యువకుడి దారుణహత్య

కాలువపల్లి వద్ద శనివారం రాత్రి ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కాలువపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న సోమశేఖర్‌ (25)కు ఇదే కాలనీలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.

బెళుగుప్ప: కాలువపల్లి వద్ద శనివారం రాత్రి ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కాలువపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న సోమశేఖర్‌ (25)కు ఇదే కాలనీలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. శనివారం రాత్రి గ్రామ సమీపంలోకి వెళ్లిన సోమశేఖర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు.

ఎస్‌ఐ నాగస్వామి, ఏఎస్‌ఐ విజయనాయక్‌లు ఆదివారం ఉదయం గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సీఐ శివప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు గుర్తించారు. వివాహిత భర్త ఆంజనేయులు ప్రధాన నిందితుడుగా నిర్ధారించారు. అయితే హత్య చేసిన ఘటనలో ఒకరే పాల్గొన్నారా.. మరికొంతమంది ఉన్నారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement