చల్‌గల్ బస్టాండ్‌ వద్ద వ్యక్తి దారుణ హత్య | Man murdered in Chalgal bus stand | Sakshi
Sakshi News home page

చల్‌గల్ బస్టాండ్‌ వద్ద వ్యక్తి దారుణ హత్య

Oct 28 2015 7:55 PM | Updated on Sep 3 2017 11:38 AM

జగిత్యాల మండలం చల్‌గల్ బస్టాండ్ వద్ద బుధవారం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.

జగిత్యాల(కరీంనగర్ జిల్లా): జగిత్యాల మండలం చల్‌గల్ బస్టాండ్ వద్ద బుధవారం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. బస్టాండ్ వద్ద నిలిచి ఉన్న వ్యక్తిని కారులో వచ్చిన దుండగులు గొంతుకోసి పరారయ్యారు. మృతుడిని జగిత్యాల మండలం గోవిందపల్లికి చెందిన రాకేష్‌గా గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement