
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మండల పరిధిలోని చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందాడు.
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నీలాంపల్లికి చెందిన నబీరసూల్ (32) అనంతపురంలోని వెలుగు సంస్థలో చిరుద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఆదివారం తండ్రిని బైక్‌పై ఎక్కించుకుని అనంతపురంలోని తాడిపత్రి బస్టాండ్ వద్ద దింపాడు.
అనంతరం నబీరసూల్ చెరువు కట్టపై నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే రోడ్డుపై పని నిమిత్తం వెలుగు కార్యాలయానికి బయల్దేరాడు. కలెక్టరేట్ దగ్గరలో చర్చి వద్ద సైకిల్‌పై అడ్డంగా వచ్చిన బాలుడిని తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన నబీరసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి వన్నూరప్ప కుమారుని మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.