మహముత్తారం మండలం నరసింగాపూర్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది.
కరీంనగర్ : మహముత్తారం మండలం నరసింగాపూర్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజు నాయక్(30) అనే వ్యక్తి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి... అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అతడు అప్పటికే మరణించాడు. చెరువులో నుంచి యువకుడి మృతదేహాన్ని వెలికి తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.