భూదాన్‌పోచంపల్లి : పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
Sep 6 2016 11:28 PM | Updated on Sep 28 2018 3:41 PM
భూదాన్‌పోచంపల్లి : పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన ఏర్పుల మల్లయ్య ఏడాది క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి మండలంలోని కనుముకుల గ్రామానికి చెందిన పాక వెంకటేశ్ అనే రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. మల్లయ్య కుమారుడైన ఏర్పుల మహేశ్(22) ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దాంతో తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన ఇతను సోమవారం సాయంత్రం మద్యంలో క్రిమిసంహారక మందును కలుపుకొని తాగాడు. అనంతరం దగ్గరలో భీమనపల్లి గ్రామంలో ఉంటున్న తన అక్క శ్రీలత ఇంటికి వచ్చి కింద పడిపోయాడు. ఇతని వద్ద నుంచి పురుగు మందు తాగిన వాసన వస్తుండడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement