ప్రేమ ముసుగులో అత్యాచారం | Man cheats woman | Sakshi
Sakshi News home page

ప్రేమ ముసుగులో అత్యాచారం

Dec 1 2015 8:03 PM | Updated on Aug 20 2018 4:27 PM

ప్రేమ ముసుగులో అత్యాచారం - Sakshi

ప్రేమ ముసుగులో అత్యాచారం

ప్రేమ పేరుతో ఓ యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన యువకుడిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు.

దుండిగల్ (రంగారెడ్డి) : ప్రేమ పేరుతో ఓ యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన యువకుడిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. సూరారం కాలనీ డివిజన్ పాండు బస్తీకి చెందిన నాగరాజు (26) అలియాస్ దొమ్మర రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రాజీవ్ గృహకల్పకు చెందిన ఓ యువతి (23), నాగరాజు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన నాగరాజు ఆమెపై అత్యాచారం చేశాడు. కారు కొనుగోలు చేసి ట్రావెల్స్ తరఫున తిప్పుతానని యువతి నుంచి రూ. 50 వేలు సైతం తీసుకున్నాడు.

గత నెల 27 వ తేదీ రాత్రి సాయిబాబానగర్‌లోని తన స్నేహితుడి ఇంటికి ఆమెను తీసుకువెళ్లిన నాగరాజు మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా సోమవారం సాయంత్రం 4 గంటలకు మరోసారి ఆమె ఇంటికి వచ్చిన నాగరాజు తనతోపాటు లాడ్జికి రావాలని లేకపోతే మనం కలిసి ఉన్న వీడియోలను అందరికీ చూపిస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు మంగళవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే రోజు నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement