వదినపై చెప్పుతో దాడి | man attacks his brother's wife | Sakshi
Sakshi News home page

వదినపై చెప్పుతో దాడి

Nov 9 2016 11:11 PM | Updated on Oct 9 2018 5:39 PM

ఇద్దరూ కులాలు వేరైనా ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వారికి తీపిగుర్తుగా ఒక కూతురు కూడా జన్మించింది.

రాయదుర్గం రూరల్ : ఇద్దరూ కులాలు వేరైనా ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వారికి తీపిగుర్తుగా ఒక కూతురు కూడా జన్మించింది. మండలంలోని చదం గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన బోయ మారెక్క, షమీ మూడేళ్లుగా ప్రేమించుకుని వివాహ​ చేసుకుని, బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. వారిద్దరికి ఒక కూతురు జన్మించింది.

రిజిష్టర్‌ పెళ్లి చేసుకోవాలని ఇరువురు నిశ్చయించుకుని   ఇద్దరు స్వగ్రామానికి వచ్చారు. పట్టణంలో రిజిష్టర్‌ కార్యాలయానికి వెళుతుండగా షమీ సోదరుడు జోక్యం చేసుకుని మా అన్న బతుకును నాశనం చేశావని నన్ను చెప్పుతో కొట్టాడని మారెక్క బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement